Sunday, July 25, 2021

పవన్ పిల్లలతో మరోసారి అడవి శేషు ముచ్చట్లు

టాలీవుడ్ హీరో అడవి శేషు పవన్ పిల్లలతో ఎంత సన్నిహితంగా ఉంటారో కొత్తగా చెప్పనవసరం లేదు. ఎవరు సినిమా చూసినప్పటి నుంచి పవన్ కొడుకు అకీరా నందన్ అడవిశేషు కు అభిమాని అయిపోయాడు. ఇక అప్పటి నుంచి అడవి శేషు ని అన్నా అని పిలుస్తారని అలాగే అడవిశేషు ఇప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని కూడా రేణు దేశాయ్ చాలా సార్లు చెప్పారు. ఇక అడవి శేష్ కూడా అప్పుడప్పుడు అకీరా ఆద్యాలతో సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు.

అయితే తాజాగా ఇటీవల అడవి శేషు అకీరా ఆద్యాలను కలిసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆద్యను అడవిశేషు వెనకనుంచి పట్టుకోగానే ఊపిరి ఆడనట్లు గా ఆద్య ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ చూపించింది. మరోవైపు అడవి శేషు పుణ్యమా అని పవన్ పిల్లలను ఎప్పటికప్పుడు చూస్తున్న అభిమానులు అడవి శేషు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ప్రస్తుతం అడవి శేషు మేజర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News