Saturday, April 20, 2024

జిల్లా వాసికి తెలుగుతేజం జాతీయ అవార్డు

కాల్వశ్రీరాంపూర్‌: మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఈర్ల సమ్మయ్యకు మన తెలుగుతేజం జాతీయ స్థాయి అవార్డు దక్కింది. హైదరాబాద్‌లోని బీఎం బిర్లా సైన్స్‌ మ్యూజియంలోని భాస్కర ఆడిటోరియంలో సమ్మయ్య అవార్డును అందుకున్నారు. పీవీ నరసింహరావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అక్షర దీక్ష సాహిత్య కళావేదిక నల్గొండ జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో 12 రంగాల్లో విశిష్ట సేవలందించిన 81 మందిని అవార్డులతో సన్మానించారు. జిల్లా నుంచి విద్యా రంగంలో విశేష సేవలందించినందుకుగాను సమ్మయ్యను పీవీ తనయుడు ప్రభాకర్‌రావు, నిర్వాహక కమిటీ కన్వీనర్‌ పీవీ రమణగుప్తా తదితర ప్రముఖులు అవార్డు పత్రం, జ్ఞాపిక, శాలువాలతో సన్మానించారు. సమ్మయ్య మూత పడే స్థితిలో ఉన్న ఎస్సీ కాలనీ పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరిచారు. పిల్లల్లోని అంతర్గత శక్తులను వెలికి తీసి, వారి సర్వతో ముఖాభివృద్దికి పాటు-పడుతున్నారు. దాతల సహకారంతో పాఠశాల మౌలిక, భౌతిక అవసరాలను తీర్చటానికి విశేషంగా కృషి చేస్తున్నారు. బడి మానేసిన పిల్లలకు విద్య ప్రాముఖ్యతను వివరించి, వారు తిరిగి చదువు కొనసాగించేలా చేస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు, యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు.వార్డు రావడం చాలా ఆనందంగా ఉందని, తనను అవార్డుకు ఎంపిక చేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, రాష్ట్రాల నుంచి పన్నెండు రంగాలకు చెందిన ప్రముఖులు, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement