Thursday, May 2, 2024

వ‌ర‌ల్డ్‌వైడ్‌గా వస్తున్న ‘మేజ‌ర్’.. ఇండియాలో 10 రోజుల పాటు ప్రీమియర్​ ​ షోలు!

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితంపై నటుడు అడివి శేష్.. అతని టీమ్ రూపొందించిన సినిమా మేజర్. ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇది తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన సంగ‌తి తెలిసిందే.. అయితే ఈ సినిమా మలయాళంలో కూడా డబ్బింగ్ వెర్షన్‌లో విడుదల కానుంది. ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా 3 భాషల్లో రిలీజ్​ చేయనున్నారు మేక‌ర్స్. ఎలాంటి టికెట్ ప్రైజ్ పెంపు లేకుండా కేవలం స్టాండర్డ్ ధరలకే సినిమాను తెరకెక్కించనున్నారు ఈ మూవీ మేక‌ర్స్. అయితే.. ఇప్పుడు మేజ‌ర్ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది.

మేజర్ విడుదలకు 10 రోజుల ముందు ప్రీ రిలీజ్ షోలు వేయబోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది సినిమా బృందం. జూన్ 3న విడుదల చేయడానికి 10 రోజుల ముందు ప్రీమియర్ షోలు వేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దేశంలోని వివిధ థియేటర్లలో 9 వేర్వేరు నగరాల్లో (ఢిల్లీ, జైపూర్, లక్నో, అహ్మదాబాద్, ముంబై, పూణే, హైదరాబాద్, బెంగుళూరు, కొచ్చి) ఈ చిత్రం ప్రీ రిలీజ్ షోలను ప్రదర్శించనున్నారు. అంటే మే 24 నుంచి స్క్రీనింగ్‌లు ప్రారంభం కానున్నాయి. సినిమా విడుదలకు 10 రోజుల ముందు ప్రత్యేకమైన ప్రీ రిలీజ్ స్క్రీనింగ్‌లను పొందడం భారతీయ సినిమాలో ఇదే మొదటిసారి కావ‌డం విశేషం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement