Saturday, April 27, 2024

The Great Indian Suicide – మ‌ద‌న‌ప‌ల్లి ఆత్మ‌హ‌త్య‌ల నేప‌థ్య వెబ్ సిరీస్ లో హెబ్బా ప‌టేల్ …

వెండితెర హీరోయిన్ హెబ్బా పటేల్ తాజాగా వెబ్ సిరీస్ బాట ప‌ట్టింది. ఒక మిస్టరీ థ్రిల్లర్‌ మూవీలో న‌టిస్తుంది. విప్ల‌వ్ కోనేటి ద‌ర్శ‌క‌త్వంతో పాటు ఈ మూవీని సొంతంగా నిర్మిస్తున్నాడు. ది గ్రేట్ ఇండియ‌న్ సూసైడ్ టైటిల్ తో వ‌స్తున్న ఈ వెబ్ సిరీస్ . ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా లో అక్టోబ‌ర్ 06 నుంచి స్ట్రీమింగ్ కానుంది. . ఈ విష‌యాన్ని తెలుపుతూ.. ”కళ్లను కప్పేసిన మూఢనమ్మకం.. నమ్మకంతో రాసుకున్న మరణశాసనం” అంటూ సోష‌ల్ మీడియాలో రాసుకోచ్చారు. దీంతో పాటు హెబ్బా పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు..

మ‌ద‌న‌ప‌ల్లి లో జ‌రిగిన వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిన‌ట్లు తెలుస్తుంది. ఓ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌ చేసుకోవాలను కుంటుంది. అయితే ఆ కుటుంబం ఆత్మ‌హ‌త్య‌కు ఎందుకు పాల్ప‌డాల‌నుకుంది? పున‌ర్జ‌న్మ‌ల‌పై వారికి న‌మ్మ‌కం ఉందా? చ‌నిపోయిన వారు మ‌ళ్లీ పుడ‌తార‌ని ఆ కుటుంబం ఎందుకు న‌మ్మింద‌నే పాయింట్‌తో ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో హెబ్బాప‌టేల్‌తో పాటు రామ్ కార్తిక్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా రేష్ వీకే, ప‌విత్రా లోకేష్‌ ఈ సినిమాలో భార్య భర్తలుగా కనిపించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement