Monday, April 29, 2024

హరీష్ శంకర్ కే పంచ్ డైలాగ్ వేసిన నెటీజన్

డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. గబ్బర్ సింగ్,డీజే, గద్దల కొండ గణేష్ వంటి సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో మరో సినిమాను తెరకెక్కించబోతున్నాడు హరీష్ శంకర్. ఇదిలా ఉండగా సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే…హరీష్ శంకర్ తాజాగా ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టాడు. అయితే హరీష్ చేసిన ఆ పోస్ట్ కి ఓ నెటిజన్ పంచ్ డైలాగ్ వేసింది.

అది ఏంటంటే…రోజుకు పదినిముషాలైనా
గుండె వేగంగా కొట్టుకోవాలట… ఫ్రెండ్స్ ట్రెడ్మిల్ ఎక్కారు….
నేను మాత్రం నువ్వు కనబడతావని…డాబా మెట్లెక్కాను!! అంటూ ఓ ఫోటోని పోస్ట్ చేశాడు హరీష్. అయితే ఆ పోస్ట్ పై ఓ నెటిజన్ స్పందిస్తూ…అప్పుడు చేలో గడ్డి మేస్తున్న ఆవు కనిపించేసరికి .. జేబులో చేతులు పెట్టుకొని కిందకి వచ్చేసారా అని కామెంట్ పెట్టింది. వెంటనే హరీష్ కూడా ఆ కామెంట్ కి రిప్లయ్ ఇస్తూ నవ్వుతున్న ఈమోజీలు పెట్టాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement