Thursday, May 9, 2024

HanuMan | నైజాం అడ్వాన్స్ బుకింగ్స్ పై క్లారిటీ

తేజ సజ్జ ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హీరో మూవీ “హనుమాన్”. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ పై తాజాగా క్లారిటీ వచ్చింది.

రేపు నైజాంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ సినిమాపై మొదటి నుంచే మంచి హైప్ ఉంది.. దీంతో ప్రేక్షకుల్లో ఈ హనుమాన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక తేజ సజ్జ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement