Wednesday, May 8, 2024

OTT Partner | గుంటూరు కారం ఓటీటీ హ‌క్కులు ఆ సంస్థ‌కే !

మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ గుంటూరు కారం.. సంక్రాంతి కానుకగా ఇవ్వాల (జనవరి 12న) థియేటర్స్ లోకి వచ్చింది. ట్రైలర్, సాంగ్స్ తో అంచనాలు పెంచేసిన సినిమా… ప్రీమియ‌ర్ షోస్ నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇక గుంటూరు కారం సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయి.

గుంటూరు కారం డిజిటల్ రైట్స్ ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ భారీ ధరకు ద‌క్కించుకుంది. ఈ సినిమా మార్చ్ మొదట్లో లేదా ఫిబ్రవరి చివర్లో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. అలాగే గుంటూరు కారం శాటిలైట్ హక్కులు జెమినీ టీవీ భారీ ధరకు కొనుక్కుందని టాలీవుడ్ టాక్.

ఇక‌, ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించగా రమ్యకృష్ణ, జయరాం, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, మురళి శర్మ, ఈశ్వరరావు.. పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement