Saturday, May 4, 2024

ఓటీటీలో దూసుకుపోతున్న‌ గోపిచంద్ డిజాస్టర్ మూవీ.. టాప్-1 ట్రెండింగ్ లో రామబాణం!

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించిన ‘రామబాణం’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. కాగా, చాలా ఆలస్యంగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ కి తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు టాప్ ట్రెండింగ్ వన్ లో దూసుకుపోతుంది. గోపీచంద్ – శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ఇది. కమర్షియల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మే 5న థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది.

అయితే, మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ కూడా అదే నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలై కనీసం టాప్ -10 ట్రెండింగ్ లోకి కూడా నిలవలేకపోయింది. కానీ గోపీచంద్ ‘రామబాణం’ మాత్రం థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచి ఓటీటీలో అదరగొడుతోంది. ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి కథానాయికగా నటించ‌గా.. నటుడు జగపతిబాబు, కుష్బూ కీలక పాత్రలు పోషించారు. సచిన్ కేడేకర్, శుభలేఖ సుధాకర్, కాశీ విశ్వనాథ్, నాజర్, వెన్నెల కిషోర్, సప్తగిరి, గెటప్ శీను ఇతర పాత్రల్లో కనిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement