Friday, May 17, 2024

Bhima | గోపీచంద్ ‘భీమా’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

గోపీచంద్ లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘భీమా’. ఈ సినిమాను యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా కన్నడ దర్శకుడు ఏ హర్ష తెరకెక్కిస్తున్నాడు. కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో గోపిచంద్‌ పోలీసు ఆఫీసర్‌గా మరోసారి అలరించబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ మూవీ రిలీజ్‌పై చిత్ర యూనిట్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా ‘భీమా’ రిలీజ్‌ చేయబోతున్నట్టు మేకర్స్‌ ఆఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు. మార్చి 8న వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమాను రిలీజ్‌ చేయబోతున్నట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement