Tuesday, April 30, 2024

విజయ్ దేవ‌ర‌కొండ‌ అభిమానుల‌కు గుడ్ న్యూస్.. లైగ‌ర్ ట్రైల‌ర్ రిలీజ్​ డేట్​ ఇదే..

పూరి జగన్నాధ్ డైరెక్ష‌న్‌లో రౌడీ బోయ్ విజయ్ దేవరకొండ, బాలివుడ్ భామ‌ అనన్య పాండే జంటగా నటించిన పాన్ ఇండియా సినిమా లైగర్. ఈ ఏడాది సినీ అభిమానుల్లో అత్యంత అంచనాలు పెంచిన‌ సినిమాల్లో లైగ‌ర్ ఒకటి. ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్‌లో, అనన్య సౌత్‌లో డెబ్యూట్ చేస్తున్నారు.. కాగా, ఈ సినిమా వీరిద్ద‌రికీ స్పెష‌ల్ అనే చెప్పాలి. ది గ్రేట్ బాక్స‌ర్ మైక్ టైసన్ కూడా ఈ మూవీలో ఓ స్పెష‌ల్ రోల్ చేస్తున్నారు.

అయితే పాన్ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కుతున్న‌ ఈ మూవీకి కరణ్ జోహార్ నిర్మాత బాధ్య‌త‌లు వ‌హించారు. సినిమా సెట్స్‌పైకి వెళ్లి.. షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా నుంచి అప్‌డేట్‌లు రాక‌పోవ‌డంతో అభిమానుల్లో నిరాశ నెల‌కొంది. మూవీకి సంబంధించిన అప్‌డేట్‌లు షేర్ చేయాల‌ని ఫ్యాన్స్ మేకర్స్‌ని అడుగుతున్నారు. కాగా, సినిమా నిర్మాతలు ఈ మూవీ ట్రైలర్‌ను త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది.

జులై రెండో వారం లేదా మూడో వారంలో లైగర్ ట్రైలర్‌ను విడుదల చేయాల‌నే ఆలోచ‌న‌లో మేకర్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆగస్ట్ 25న విడుదల కానున్న ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు అదే స‌రైన సమయంగా భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇటీవల, విజయ్ జూన్ 22న తన ట్విట్ట‌ర్ ఎకౌంట్ లో ఆసక్తిక‌ర‌మైన పోస్ట్ చేశాడు. “Know that I hear you.. your man has always got a plan. “10” #Liger (sic).” అని ట్వీట్ చేశాడు.

త‌మ అభిమాన హీరో ఈ ట్వీట్ చేసినప్పటి నుండి, ఫ్యాన్స్ లైగర్ కు సంబంధించిన అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో విజయ్, అనన్యతో పాటు, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, అలీ, మకరంద్ దేశ్‌పాండే, విష్ణు రెడ్డి కూడా ఉన్నారు. లైగర్ ఆగస్ట్ 25, 2022న థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement