Sunday, April 28, 2024

Devara | అధిరిపోయిన ఎన్టీఆర్‌‌ “దేవర” గ్లింప్స్..

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం దేవర. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్‌లో.. వెన్నెల రాత్రి సముద్రం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ‘ఈ సముద్రం చేపలకంటే కత్తులను .. నెత్తురును ఎక్కువగా చూసి ఉంటుంది. అందుకే దీనిని ఎర్రసముద్రం అంటారు’ అనే ఎన్టీఆర్ డైలాగ్ కంటెంట్ పై మరింత కుతూహలాన్ని పెంచుతోంది. ఇక ఆ సన్నివేశాలకు అనిరుధ్ అందించిన మ్యూజిక్ మరింత ఆకట్టుకునేలా ఉంది.

YouTube video

సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని యువసుధ ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కానుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement