Tuesday, April 30, 2024

ఫ‌న్, మోర్ ఫ‌న్.. మ‌రో 40 రోజుల్లో F3

అనిల్ రావిపూడి రచన, దర్శకత్వం వహించిన రొమాంటిక్, కామెడీ చిత్రం ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఎఫ్​2.. ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా అండ్ మెహ్రీన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఫిబ్రవరి 2019లో విజయం సాధించిన F2కి సీక్వెల్ గా F3ని కూడా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరిగింది. క‌రోనా మహమ్మారి కారణంగా F3 విడుదల చాలాసార్లు పోస్ట్ పోన్ అయిన సంగ‌తి తెలిందే. కాగా, ఈ సినిమాని మే 27న థియేటర్లలో విడుదల చేసేందుకు మూవీ టీమ్​ రెడీ అయ్యింది. విడుద‌ల‌కు ఇంకా 40రోజులు మాత్ర‌మే మిగిలి ఉండ‌టంతో ఒక స్పెష‌ల్ వీడియోని ఇవ్వాల (ఆదివారం) రిలీజ్ చేశారు. మీరూ చూసి ఎంజాయ్​ చేయండి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement