Monday, April 29, 2024

సోనీ లివ్ లో ‘గార్గి’.. OTT విడుదల తేదీ ఇదే..

‘గార్గి’ విడుదలైన ఒక నెలలోపే OTTలో రిలీజ్ కి సిద్ద‌మైపోయింది. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ కంపెనీ SonyLIV తన ట్విట్టర్ ఎకౌంట్లో ఆగస్టు 12 నుండి ఈ మూవీ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. కోర్ట్‌రూమ్ డ్రామాగా రూపోందిన సినిమా “గార్గి”. జూలై 15న థియేటర్‌లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులు, విమ‌ర్ష‌కుల నుంచి మంచి టాక్ నే సంపాదించుకుంది. గౌతం రామచంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

బాల్యానికి సంబంధించిన సామూహిక అత్యాచారం కేసులో అనుమానిత ప్రమేయంతో నిర్బంధించబడిన తన తండ్రిని విడిపించ‌డానికి గార్గి చేసిన పోరాటాన్ని ఈ చిత్రం వర్ణిస్తుంది. అంతే కారు ఈ సినిమా చూసిన విమ‌ర్ష‌కులు ఇది “వన్-వుమెన్ షో” అని లేబుల్ చేసిన ప‌ల్ల‌విని ఆకాశానికెత్తేశారు, పైగా సాయి ప‌ల్ల‌వి నటన ఈ సంవత్సరం భారతీయ సినిమాలో అత్యుత్తమ మహిళా నటనగా పేర్కొనబడింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement