Tuesday, April 30, 2024

టిక్ టాక్ స్టార్ భార్గవ్ పై కేసుపై ఫుల్ క్లారిటీ… దిశ ఏసీపీ ప్రేమ కాజల్

ప్రేమ పేరుతో మైనర్ బాలికని శారీరకంగా అనుభవించిన టిక్ టాక్ స్టార్ భార్గవ్ ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దిశ పోలీసులు భార్గవ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా దిశా ఏసిపి ప్రేమ కాజల్ మాట్లాడుతూ. బాలికను మాయమాటలతో లోబర్చుకుని గర్భవతిని చేసిన కేసులో భార్గవ్ ను అరెస్టు చేశామన్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని ప్రేమ కాజల్ తెలిపారు. ఇక మూడో తేదీ వరకు భార్గవ్ రిమాండ్ లో ఉంటాడని ఆమె పేర్కొన్నారు.

టిక్ టాక్ లో ఇతర మీడియా లో అవకాశాలు ఇప్పిస్తానని 14 ఏళ్ల మైనర్ బాలికను లైంగికంగా భార్గవ్ వాడుకున్నాడని… మొదట ప్రేమిస్తున్నానని వెంట పడిన భార్గవ్ ఒప్పుకోకపోయేసరికి దుస్తులు మార్చుకుంటున్నప్పుడు ఫోటోలు తీసి ఉన్నాయంటూ బెదిరించి లోబరుచుకున్నాడని ప్రేమ కాజల్ తెలిపారు. సోషల్ మీడియా లో పాపులర్ చేస్తామంటే ఎవరైనా చెప్తే నమ్మి మోసపోవద్దని వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తే ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని దిశా ఏసీపీ ప్రేమ కాజల్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement