Thursday, April 25, 2024

నితిన్ హిట్ సినిమా కన్నా ఫ్లాప్ సినిమాకే రేటింగ్ ఎక్కువ!!

ఈ ఏడాది యంగ్ హీరో నితిన్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ఒకటి రంగ్ దే కాగా, రెండవది చెక్. చెక్ సినిమాను చంద్రశేఖర్ ఏలేటి తెరకెక్కించారు. అయితే ఇందులో బాక్సాఫీస్ వద్ద చెక్ విఫలం కాగా… రంగ్ దే సినిమా సక్సెస్ అయింది. అయితే ఇటీవల బుల్లితెర పై ఈ రెండు సినిమాలు కూడా ప్రసారమయ్యాయి. విశేషమేంటంటే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన చెక్ సినిమాకు రంగ్ దే సినిమా కన్నా ఎక్కువ టిఆర్పి రేటింగ్ వచ్చింది.

చెక్ చిత్రం 8.53 టిఆర్పి రేటింగ్ ను నమోదు చేసుకోగా రంగ్ దే చిత్రం 7.22 టిఆర్పి రేటింగ్ ను నమోదు చేసింది. ఇక సినిమాలో రకుల్, ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో నటించారు. రంగ్ దే సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement