Saturday, May 4, 2024

చావు కబురు చల్లగా నుండి ఫుల్ వీడియో సాంగ్

ఆర్ఎక్స్ 100 చిత్రంతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు టాలీవుడ్ హీరో యంగ్ హీరో కార్తికేయ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు మంచి వసూళ్లను సైతం రాబట్టింది. ఇక ఈ సినిమా తరువాత గుణ 369, 90 ఎమ్ ఎల్ సినిమాలు చేశాడు. అయితే ఈ సినిమాలు మొదటి సినిమా ఆకట్టుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం చావు కబురు చల్లగా సినిమా చేస్తున్నాడు కార్తికేయ. ఈ సినిమా మార్చి 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ ,టీజర్ సాంగ్స్ కు విశేషమైన స్పందన వచ్చింది.

తాజాగా మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఫిక్స్ అయిపో అంటూ ఫుల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమాలో స్వర్గపురి వాహనం డ్రైవర్ గా కార్తికేయ నటిస్తున్నాడు. లావణ్య నర్సు పాత్రలో నటించబోతోంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement