Saturday, April 27, 2024

ప‌వ‌న్ క‌ల్యాణ్ – సుజీత్ ల మూవీ ‘OG’ కి తొలి క్లాప్

సాహో ద‌ర్శ‌కుడు సుజీత్ తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించ‌నున్న కొత్త మూవీ ‘OG’ పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా నిర్వ‌హించారు. అన్నపూర్ణ స్టూడీయోస్‌లో చిత్రయూనిట్‌ ఈ కార్యక్రమం కోసం పవన్‌ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. పవన్‌తో పాటు పలువురు నిర్మాతలు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్‌ రిలీజ్‌ చేసారు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఇక ఈ కార్యక్రమానికి థమన్‌ కూడా వచ్చాడు. దాంతో ఈ సినిమాలో సంగీత దర్శకుడిగా థమన్‌ దాదాపు ఖరారైనట్లే అనిపిస్తుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఫేమ్‌ డి.వి.వి దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి ఇదే ఏడాది చివర్లో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement