Friday, May 10, 2024

ఫిల్మ్ ఫేర్ పై రానా సెటైర్!

ప్రయోగాత్మక సినిమాలు చేసే చాలా కొద్ది మంది నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. హీరో అనే గీత గీసుకుని ఆయన కూర్చోలేదు. పాత్ర నచ్చితే, నెగిటివ్ క్యారెక్టర్ అయిన చేస్తారు. బాహుబలిలో భళ్లాలదేవగా నటించి యావత్తు భారత సినీ ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ‘అరణ్య’గా ఒక విలక్షణమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 

అయితే, రానా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అరణ్యలోని రానా స్టిల్‌ను వాడుకుంది ఫిల్మ్ ఫేర్ సంస్థ. దేశంలో ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితి గురించి కౌంటర్ వేస్తూ అరణ్య స్టిల్‌ను ట్వీట్ చేసింది. దానిపై రానా సెటైర్ వేశాడు.

ప్రస్తుతం దేశంలో కరోనా ఉధృతి అధికంగా ఉంది. సెకండ్ వేవ్ తో కేసులు పెరిగిపోతున్నాయి. అయితే ఇలాంటి మాటలన్నీ వింటే మా రియాక్షన్ ఇలా ఉందంటూ అరణ్య పోస్టర్‌ను ఫిల్మ్ ఫేర్ సంస్థ షేర్ చేసింది. అయితే వారు చెప్పిన సంగతి నిజమే అయినా కూడా అందులో రానా పేరును తప్పుగా రాశారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ రానా కౌంటర్ వేశాడు. మీరు నా పేరు తప్పుగా రాసిన ప్రతీసారి నేను కూడా అలానే రియాక్ట్ అవుతున్నాను అంటూ పంచ్ వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement