Sunday, April 28, 2024

దేశ జెండాను అవమానించారంటూ చెర్రీపై నెటిజన్ల ఫైర్

జాతీయ పతాకాన్ని అవమానపరిచాడంటూ రామ్ చరణ్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు. … రామ్ చరణ్ పలు బ్రాండ్స్‌కు ప్రచార కర్తగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే కదా. అందులో హ్యాపీ మొబైల్స్‌కు మెగా పవర్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ ఆ మొబైల్స్‌కు సంబంధించిన ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు మన దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సదరు హ్యాపీ మొబైల్స్ వారు రామ్ చరణ్‌తో ఫుల్ పేజీ పేపర్ యాడ్స్ ఇచ్చారు. ఈ ప్రకటనలో రామ్ చరణ్ తెల్లటి రంగు డ్రెస్సులో జాతీయ పతాకం ఎగరవేసినట్టు ఓ ఫోటో ఉంది.

https://twitter.com/always2_suhel/status/1424629771732979712?t=yGRmmdfTvbJIflrS7NNCrg&s=19

ఇందులో అశోక ధర్మచక్రం లేకపోవడంతో పలువురు రామ్ చరణ్ జాతీయ జెండాను అవమానపరిచారంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఈ విషయమై సదరు సంస్థ వివరణ ఇచ్చింది. అయితే అయిన ఉద్దేశపూర్వకంగా జాతీయ జెండాను అవమానించ లేదని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.

ఇలా కొంత మంది కామెంట్లు పెడుతూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి టాగ్ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి జాతీయ జెండాను కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ కొరకు వాడరాదని తేల్చి చెప్పేశారు. కానీ రామ్ చరణ్ తేజ అ పట్టుకున్న టువంటి  ఆ త్రివర్ణ జెండా ని యాడ్ ల కోసం వాడుకోవచ్చు అని చెప్పేశారు ఎందుకంటే అందులో అశోకచక్ర లేదు కాబట్టి, అది కేవలం మూడు రంగులు ఉన్న ఒక జెండా లాగా పరిగణించబడుతుంది. జాతీయ జెండా లాగా కాదు కాబట్టి దీన్ని కమర్షియల్ యాడ్ ల కోసం వాడుకోవచ్చు అంటూ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఈ వివాదం ఇంతటితో ముగిసి పోయేలాగా సదరు వ్యక్తి పెట్టిన ట్వీట్ నీ డిలీట్ చేయమని చెప్పారు.

ఇది కూడా చదవండి: పంద్రాగస్టు వేడుకల్లో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య ఘర్షణ

Advertisement

తాజా వార్తలు

Advertisement