Thursday, May 2, 2024

అభిమానుల బుర్రలు మారాలి….సిద్దార్థ్

హీరో సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి చిత్రాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సిద్ధార్థ్. అయితే సిద్ధార్థ్ ఇటీవల సోషల్ మీడియాలో చేసే ట్వీట్ తో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక తాజాగా మరో ట్వీట్ చేశాడు సిద్ధార్థ్. అభిమానుల బుర్రలు పూర్తి మారాలని తెలుగు, తమిళ సినిమా అభిమానులు ఒకరితో ఒకరు గొడవ పడటం మాని తమ దృష్టిని నెట్ ఫ్లిక్స్ మీద ఫోకస్ పెట్టాలని వరల్డ్ బెస్ట్ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ సౌత్ ఇండియా మొత్తాన్ని ఒకే తాటి కి తీసుకొచ్చి…నెట్ ఫ్లిక్స్ ఇన్ సౌత్ గా పేర్కొంటుందని చెప్పాడు.

ఇక్కడ ఉన్న నాలుగు భాషల చిత్ర పరిశ్రమలకు దేని ప్రత్యేకత దానికి ఉందని… అలా కాకుండా ఒకటి గా గుర్తించడం కరెక్ట్ కాదని ఈ విషయమై నెట్ ఫ్లిక్స్ పై పోరాటం చేయాలని సిద్దార్థ్ అన్నాడు. అయితే దానికి కారణం లేకపోలేదు. ఇటీవల రిలీజైన నారప్ప సినిమా ఈ వివాదానికి కారణమైంది. నారప్ప అసురన్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. కాగా ధనుష్ నటించినంత అద్భుతంగా వెంకటేష్ నటించిన లేదని తమిళ్, తెలుగు అభిమానులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదే విషయంపై సిద్దార్థ్ స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement