Thursday, May 2, 2024

Project-K | కల్కి గ్లింప్స్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌.. రిలీజ్ డేట్ వాయిదా ప‌డే చాన్స్!?

ప్రభాస్ హీరోగా, డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ప్రాజెక్ట్-కే సినిమాకి “కల్కి 2898 AD” అనే ఫిక్స్ చేశారు మేకర్స్. యూఎస్ లోని కామిక్ కాన్ వేధిక‌పై టైటిల్ తో పాటు మూవీ గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ హిస్టారిక్-సైన్స్ ఫిక్షన్ మూవీ గ్లింప్స్ తో అభిమానులు, ప్రేక్ష‌కులు మంచి బాగా సాటిస్‌ఫై అయిన‌ట్టు కనిపిస్తోంది.

అయితే.. ఇటీవలే రిలీజ్ అయిన గ్లింప్స్ & పోస్ట‌ర్ల నుండి మూవీ రిలీజ్ డేట్ ని తోల‌గించారు మేక‌ర్స్. దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే చాన్స్ ఉందని సొష‌ల్ మీడియాలో బిగ్ బ‌జ్ క్రియేట్ అయింది. ఈ మూవీ మొదట అనుకున్న తేదీ ప్రకారం వ‌చ్చే ఏడాది (2024) జనవరి 12న విడుదల కానుంద‌ని వెల్ల‌డించారు మేకర్స్.. అయితే ఈ మూవీ ఇప్పుడు పొస్ట్ పొన్ అయ్యి 2024 వేసవిలో థియేటర్లలోకి వ‌చ్చే చాన్స్ ఉందని సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. కాగా, ఈ విష‌యంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -

ఇక ఈ సైన్స్ ఫిక్షన్ కల్కి 2898 AD లో ప్రభాస్‌తో పాటు, దీపికా పదుకొణె కథానాయికగా న‌టిస్తోండ‌గా.. దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, పశుపతి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ ఈ భారీ ప్రాజెక్ట్‌ని నిర్మించింది, దీనికి సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement