Saturday, May 4, 2024

‘హేరా ఫేరి 3’ పై అదిరిపోయే అప్‌డేట్… సోషల్ మీడియాలో మీమ్స్ వరద

బాలీవుడ్ సినిమా ‘హేరా ఫేరి’ (2000) ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. మలయాళంలో వచ్చిన ‘రాంజీ రావ్ స్పీకింగ్’ సినిమాకు అది రీమేక్. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ కామిడీ మూవీలో అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ ప్రముఖ పాత్రల్లో నటించారు. ‘హేరా ఫేరి’ సినిమా బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయింది. హిందీలో బెస్ట్ కామెడీ సినిమాలలో మొదటి వరుసలో ఉంటుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో 2006లో ‘హేరా ఫేరి 2’ సినిమాను రూపొందించారు. సీక్వెల్ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందులో కూడా అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ తమ తమ పాత్రలలో నటించారు.

2000 లో వచ్చిన ‘హేరా ఫేరీ’ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా, 2006 లో వచ్చిన రెండవ భాగం ‘ఫిర్ హేరా ఫేరీ’ నీరజ్ వోరా దర్శకత్వం వహించారు. కాగా, ఈ ఫ్రాంచైజీ గురించి చర్చించడానికి అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్ ముంబైలోని ఎంపైర్ స్టూడియోస్‌లో సమావేశమయ్యారు. హేరా ఫేరి 3పై ఇది వారి మొదటి అధికారిక సమావేశం. అయితే, ఈ ఐకానిక్ కామెడీ మూవీపై మరో ప్రత్యేక అప్‌డేట్ కూడా ఉంది. సినీవర్గాల సమాచారం మేరకు, అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి మరియు పరేష్ రావల్ ముగ్గురూ ఈ రోజు ముంబైలో హేరా ఫేరి 3 షూటింగ్ ప్రారంభించినట్టు తెలుస్తోంది.

- Advertisement -

అయినప్పటికీ, దర్శకుడు, తారాగణంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే వారం రోజుల్లో ఆ వివరాలు కూడా వెల్లడి కానున్నట్టు తెలుస్తోంది. దర్శకుడి ప్రస్తుతానికి, ‘హేరా ఫేరి 3’లో రాజుగా అక్షయ్ కుమార్, శ్యామ్‌గా సునీల్ శెట్టి, బాబూరావుగా పరేష్ రావల్ తిరిగి తమ పాత్రలను పోషించబోతున్నాట్టు తెలుస్తోంది. ఇక ఈ వార్త తెలియగానే సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది.. ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండింగ్‌లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement