Monday, May 13, 2024

డాంకీ కాదు “డంకీ”.. కింగ్ ఖాన్ కొత్త మూవీ

కొన్ని రోజులుగా చిత్రనిర్మాత రాజ్‌కుమార్ హిరానీ, బాలీవుడ్ కింగ్ ఖాన్‌ షారుక్ సినిమా గురించి రకరకాల వార్తలు వ‌స్తున్నాయి. ‘3 ఇడియట్స్‌’, ‘మున్నాభాయ్‌ ఫ్రాంచైజ్‌’, ‘పీకే’, ‘సంజు’ వంటి భారీ కమర్షియల్‌ విజయాలను అందించిన హిట్‌మ్యాన్‌ రాజ్‌కుమార్‌ హిరానీ తొలిసారి షారుఖ్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీకి పేరు కూడా ఖ‌రారైంది. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ డిటెయిల్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.

షారుఖ్ ఖాన్, రాజ్‌కుమార్ హిరానీ కొత్త చిత్రం పేరు ‘డంకీ’ , బాలీవుడ్ వీరిద్ద‌రు కలిసి పనిచేయడం ఇదే ఫ‌స్ట్ టైమ్‌. డంకీ టైటిల్ ప్రకటనతో పాటు, మేకర్స్ ఓ వీడియోను కూడా షేర్ చేశారు.. దాంతోపాటే విడుదల తేదీని కూడా ప్రకటించారు. 2023 డిసెంబర్ 22న ఈ సినిమాని విడుదల చేయ‌బోతున్న‌ట్టు ఆ వీడియోలో ఉంది. అంటే షారుక్ ఖాన్ వచ్చే ఏడాది క్రిస్మస్ ర‌ష్‌ని క్యాష్ చేసుకునేందుకు ఇప్ప‌టి నుంచే ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement