Tuesday, April 30, 2024

థాంక్యూ సినిమాలో చైత‌న్య కారెక్ట‌ర్ ఏంటో తెలుసా?

తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య త‌దుపరి చిత్రం థ్యాంక్యూ.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం నిర్వహిస్తుండ‌గా, వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో చైతన్య‌ ఒక‌ హాకీ ప్లేయర్‌గా కనిపించనున్న‌ట్టు తెలుస్తోంది. నాగ చైతన్య హాకీ ప్లేయర్‌గా నటించినప్పటికీ, ఈ మూవీ స్పోర్ట్స్ డ్రామా కాకుండా విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నారు.

నాగ చైతన్య., విక్రమ్ కుమార్ గతంలో మనం సినిమాలో కలిసి పనిచేశారు, కాగా.. థాంక్యూ సినిమాలో చైతూ స‌ర‌స‌న‌ రాశి ఖన్నా, అవికా గోర్ కథానాయికలు ప్ర‌దాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ ఈ మూవీనికి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు, చైతన్య బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దా అనే సినిమాతో తన బాలివుడ్ ఎంట్రీని ఇవ్వ‌నున్నాడు. అయితే ప్రస్తుతం చైత‌న్య‌ అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క ఒరిజినల్ వెబ్ సిరీస్ షూటింగ్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement