Thursday, May 2, 2024

కాజల్ కెరీర్ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

కెరీర్ ను ప్రారంభించి చాలా ఏళ్ళు అవుతున్న ఏ మాత్రం జోష్ తగ్గకుండా వరుస సినిమాలను చేస్తోంది కాజల్ అగర్వాల్. ఇటీవలే వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆ స్పీడ్ ను ఏమాత్రం తగ్గించలేదు. అయితే మొన్నటికి మొన్న కాజల్ ఉమ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాకి ఓకే చెప్పింది. ఈ సినిమాకు తథాగత సింఘా దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఆఖరికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ సినిమా షూటింగ్ మొత్తం కూడా కలకత్తాలోనే చేయనున్నారట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం కాజల్ కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ రెండు కోట్లకు పైగా తీసుకుంటోందని సమాచారం. ఇక ఇటీవల కాజల్ మంచు విష్ణు ప్రధాన పాత్రలో వచ్చిన మోసగాళ్లు సినిమాలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇక అలాగే మెగాస్టార్ చిరంజీవి, ఆచార్య సినిమాలో కాజల్ నటిస్తోంది. అలాగే నాగార్జున ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తుంది.

మా ఎన్నికలపై కోట ఫైర్ !!

Advertisement

తాజా వార్తలు

Advertisement