Wednesday, April 24, 2024

మా ఎన్నికలపై కోట ఫైర్ !!

మా అసోసియేషన్ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరగబోతున్నాయి. అధ్యక్ష బరిలో మొత్తం ఐదుగురు ఉన్నారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ, నటుడు సీవీఎల్ నరసింహారావు పోటీకి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికే పలువురు సీనియర్స్ ఒక్కొక్కరికి మద్దతు ప్రకటిస్తున్నారు. కాగా ఈసారి కొత్తగా లోకల్ నాన్ లోకల్ అనే మాట కూడా ఒకటి తెరపైకి వచ్చింది.

ఇక ఇదే విషయమై కోట శ్రీనివాసరావు కూడా స్పందించారు. అసలు మా ఎన్నికలు ఎవరు ప్రకటించారు. ఇప్పుడున్న కమిటీ ప్రకటించిందా.. ఏదో ఒక ప్యానల్ ప్రకటించారు. నాకు అదే ఆగ్రహం కలిగించింది. టైం వస్తే మాట్లాడదాం. ఇప్పుడది అనవసరం అన్నారు కోట శ్రీనివాసరావు. అలాగే నాగబాబు వ్యాఖ్యలు కూడా సరికాదని అన్నారు కోట శ్రీనివాసరావు. మరి కోట మద్దతు ఎవరికి ఉంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement