Sunday, April 28, 2024

చరణ్ తో నటించేందుకు కియారా ఎంత డిమాండ్ చేసిందో తెలుసా ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. కాగా ఈ సినిమాకు ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తుండగా ,తమన్ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించేది కియారా అద్వానీ అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కియారా అద్వానీ రెమ్యునరేషన్ కి సంబంధించి ఓ వార్త ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ సినిమాకు కియారా కాస్త గట్టిగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేసిందట. అందుకు దర్శక నిర్మాతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement