Tuesday, May 7, 2024

Guntur Kaaram | మహేష్ బాబు ఫ్యాన్స్‌కు నిరాశే.. ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ !

త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. కాగా, ఈ మూవీ ​ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రేపు (జనవరి 6) హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించి అభిమానులకు బ్యాడ్ న్యూస్ అందించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి రాకపోవడంతో ఈ ఈవెంట్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక, ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదికను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. దీంతో ప్రిన్స్ అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement