Friday, April 26, 2024

ఈ సారి ఏడ్చే సీత కాదట..!! ఆదిపురుష్ లేటెస్ట్ అప్డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. అలాగే రావణాసురుడిగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు. ఇక సీత గా హీరోయిన్ కృతి సనన్ కనిపించబోతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.

ఈ సినిమాలో సీతా దేవి పాత్ర ఇదివరకు అందరూ చూపించినట్లుగా బాధపడుతూ ఉండే పాత్ర కాదట. కొద్దిగా డిఫరెంట్ గా చూపించబోతున్నాడట దర్శకుడు. సీతాదేవి ఎమోషనల్ క్యారెక్టర్ అయినప్పటికీ ఆమె లో ఉన్నటువంటి వయోలెన్స్ మాత్రం ఎవరూ చూపించలేదు. కానీ ఈసారి ఆది పురుష్ లో మాత్రం వారియర్ సీతను చూపిస్తారని బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement