Tuesday, March 26, 2024

విజయ్ వంశీల సినిమా అనౌన్స్ మెంట్ అప్డేట్ ?

చాలా మంది తమిళ స్టార్ హీరోలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇక ఇటీవల మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ కి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా స్ట్రైట్ గా తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాడు. కాగా ఈ సినిమా అనౌన్స్ మెంట్ పై రకరకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే వారం లోనే ఉంటుందని టాక్ నడుస్తుంది. ఫ్యాన్స్ కూడా ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్నారు. అలాగే అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement