Tuesday, May 14, 2024

Dimple: చిల‌క‌ప‌చ్చ‌లో డింపుల్ మెరుపులు ..

డింపుల్ హ‌య‌తి టాలీవుడ్ కి మెరుపులా దూసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. ఒక్క‌సారిగా స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్సులందుకుని అంద‌ర్నీ స‌ర్ ప్రైజ్ చేసింది. ఖిలాడీ, రామ‌బాణం లాంటి చిత్రాల తో మ‌రింతగా ద‌గ్గ‌రైంది. కానీ ఆ వేగాన్ని అటుపై క‌నసాగించ‌లేక‌పోయింది.

ఇక సోష‌ల్ మీడియాలో డింపుల్ యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోలతో నెటి జ‌నుల‌కు ట‌చ్ లో ఉంటుంది. ఎలివేష‌న్ ప‌రంగా ఎక్క‌డా త‌గ్గేదేలే అంటూ ఇప్ప‌టికే చాలాసార్లు ప్రూవ్ చేసింది. తాజాగా అమ్మ‌డు లెహంగా దుస్తుల్లో త‌ళుకులీనింది. ఇదిగో ఇక్క‌డిలా ఆకు ప‌చ్చ రంగు లెహంగాలో అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేసింది. అమ్మ‌డు అందంగా అలంక‌రించుకున్న కొన్ని ఫోటోల్ని నెట్టింట వ‌దిలిది. నుదిటిన పాపిడి బొట్టు.. డిజైన‌ర్ లెహంగా..చేతికి మ్యాచింగ్ యాక్స‌ర‌సీస్..మ్యాక‌ప్..హెయిర్ స్టైల్ ప్ర‌తీది డింపుల్ ని ఎంతో అందంగా హైలైట్ చేస్తున్నా యి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement