Friday, April 26, 2024

కుడి ఎడమైతే వెబ్ సిరీస్ పై దేవరకొండ ప్రశంసలు

కరోనా కాలంలో డిజిటల్ రంగానికి ఆదరణ పెరిగింది . వెబ్ సిరీస్ లను చూసేందుకు సినీ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా కుడిఎడమైతే వెబ్ సిరీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు స్టార్ హీరో విజయ్ దేవరకొండ. కుడిఎడమైతే వెబ్ సిరీస్ ను తాజాగా తాను చూసినట్లు తెలిపారు . చాలా బాగుందని అయితే ఇది తెలుగులో ఉన్న వెబ్ సిరీస్ లలో గొప్పది అంటూ చెప్పుకొచ్చారు .

రెండవ సీజన్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు విజయ్ దేవరకొండ .అమలాపాల్ మరియు రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది . పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ రెండవ సీజన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement