Thursday, May 2, 2024

నిహారిక డెడ్ పిక్సెల్స్.. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

వీడియో గేమ్స్ నేపథ్యంలో డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్ తెర‌కెక్కింది ..వీడియో గేమ్స్ చూపిస్తున్న ప్రభావం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ నడుస్తుంది. కొంతమంది యువతీ యువకులు వీడియో గేమ్ ఆడుతూ తమ చుట్టూ ఏం జరుగుతుందనేది పట్టించుకోకపోవడం వలన, ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది అనేది కథ. కాగా ఈ సిరీస్ డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. న‌టి..నిర్మాత నిహారిక డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. బ్రిటన్ వెబ్ సిరీస్ ఆధారంగా దీనిని రూపొందించారు. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. గాయత్రిగా నిహారిక ప్రధానమైన పాత్రను పోషించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో, అక్షయ్ .. భావన .. వైవా హర్ష కనిపించనున్నారు. ఇప్పటికే వదిలిన టీజర్ .. ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తిని రేకెత్తించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement