Friday, May 17, 2024

PaPa Trailer | దాదా తెలుగు వెర్షన్ ట్రైలర్ రిల‌జ్.. త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో !

గత ఏడాది తమిళంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా మూవీ ‘దాదా’. కవిన్, అపర్ణా దాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం.. ఫాదర్ సెంటిమెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కేవలం నాలుగు కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 20 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకుంది.

కాగా, ఈ మూవీని ‘పాపా’ పేరుతో తెలుగు డబ్బింగ్ చేసి తీసుకు వస్తున్నారు. నీరజ సమర్పణలో పాన్ ఇండియా మూవీస్, జెకె ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఎంఎస్ రెడ్డి ఈ మూవీని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి ఆడియన్స్ ముందుకు తీసుకు రానున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement