Thursday, May 2, 2024

TS – ఫ్రెండ్లీగా ఉందాం – ఇదే అందరికీ బెస్ట్​

పొలాల నుంచి పరిశోధనల దాకా మహిళల పాత్ర
ప్రతి రంగంలోనూ మరింత రాణించాలి
ఫ్యాక్టరీలు, అగ్రికల్చర్​, సైంటిఫికల్​ రీసెర్చ్​లో భాగస్వామ్యం పెరగాలి
ఫ్రెషర్స్​ నియామకాలు పెంచేలా చూడాలి
బ్లూ కాలర్​ జాబ్స్​లోకి ఎక్కువ మంది రావాలి
పని ప్రదేశాల్లో స్నేహపూర్వక వాతావరణం
24 గంటల వైద్య సదుపాయాలను కల్పించాలి
మహిళలపై పెట్టుబడి పెట్టండి.. పురోగతిని వేగవంతం చేయండి థీమ్​
సాహసోపేత కార్యక్రమాలను చేపట్టిన ఐటీసీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని అన్ని రంగాల్లో మహిళల పాత్ర మరింత పెరగాల్సి ఉందని ఐటీసీ అభిలాషించింది. మహిళలపై పెట్టుబడి పెట్టంది.. పురోగతిని వేగవంతం చేయండి అన్న థీమ్‌తో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తన ప్రయత్నాలను కొనసాగించనున్నట్లు తెలిపింది. సమాజంలోని ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఐటీసీ వెల్లడించింది.

మహిళల భాగస్వామ్యం ఫ్యాక్టరీలు, వ్యవసాయం, శాస్త్రీయ పరిశోధనలు, ఆవిష్కరణలలో పెంచాలని, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఐటీసీ తెలిపింది. మహిళా ఫ్రెషర్స్‌ నియామకాన్ని పెంచడం, పనిలో మహిళల పట్ల స్నేహపూర్వక విధానాలను సంస్థాగతీకరించం, సాధికారిత కోసం పెద్ద ఎత్తున ప్రభావవంతమైన సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాల్సి ఉందని పేర్కొంది.
ఐటీసీకి చెందిన ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు చేసే ఇంటిగ్రేటెడ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ మానూఫ్యాక్చరింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ (ఐసీఎంఎల్‌)లో మహిళలు పెద్ద ఎత్తున పని చేస్తున్నారు. ఈ సంస్థకు చెందిన వివిధ విభాగాల్లో మహిళలు 50-80 శాతం వరకు ఉన్నారని పేర్కొంది.

బ్లూ కాలర్​ జాబ్స్​లోకి మహిళలు రావాలి..

ఐటీసీకి మైసూర్‌లో, తెలంగాణలోని మెదక్‌లో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు చేసే కేంద్రాలు ఉన్నాయి. పని చేసే చోట మహిళలకు సౌకర్యవంతమైన వాతావరణ ఉండేలా ఐటీసీ చూస్తోందని, బ్లూకాలర్‌ జాబ్స్‌లోకి మరింత మంది వచ్చేలా కంపెనీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది. మహిళలకు 24 గంటలూ వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నట్లు తెలిపింది. ఐటీసీ లైఫ్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఎల్‌ఎస్‌టీసీ)లో 47 శాతం మహిళా ఉద్యోగులు ఉన్నట్లు తెలిపింది. 2025-26 నాటికి వీరి సంఖ్య 50 శాతానికి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సంస్థ సోషల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ కింద ఇప్పటి వరకు 50 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలిగిందని తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement