Saturday, May 4, 2024

క‌స్ట‌డీ మూవీ నుండి.. మేకింగ్ వీడియో

హీరో నాగ‌చైత‌న్య న‌టిస్తున్న తాజా చిత్రం కస్టడీ. కృతిశెట్టి హీరోయిన్ గా న‌టిస్తుంది. వెంకట్ ప్రభు డైరెక్ట్‌ చేస్తున్నాడు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో NC 22గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం మే 12న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో, టీజర్‌, ట్రైలర్‌ ఛేజింగ్, యాక్షన్ సన్నివేశాలతో సాగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఈ మూవీలో కథానుగుణంగా వచ్చే అండర్‌ వాటర్‌ సీక్వెన్స్ మేకింగ్ నాగచైత‌న్య ఈ చిత్రంలో శివ అనే పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. కస్టడీ మూవీలో అరవింద్‌ స్వామి విలన్‌గా నటిస్తుండగా.. వెన్నెల కిశోర్‌, శరత్‌కుమార్‌, ప్రేమ్‌గీ అమ‌రేన్‌, సంప‌త్ రాజ్, ప్రియమణి కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యాన‌ర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి. మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా, యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement