Sunday, April 28, 2024

రియల్ హీరో కి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతుంది. ప్రతి రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పడగా… తాజాగా కూడా ఈ మహమ్మారి బారిన ప్రముఖ నటుడు సోనూసూద్ పడ్డారు.

ఇటీవల కరోనా పరీక్షలు చేయించుకున్న సోనూసూద్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. ఇక సోనూసూద్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. గతంలో కరోనా సమయంలో ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేసి రియల్ హీరో అయ్యాడు సోనూసూద్. కష్టంలో ఉన్నామని అడిగిన ప్రతి వారికి సహాయం చేసి దేవుడయ్యాడు. ఇక ప్రస్తుతం సోను సూద్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement