Sunday, May 19, 2024

ఓటీటీలో రానున్న కోబ్రా.. రిలీజ్ డేట్ చెప్పేసిన మేక‌ర్స్

అజ‌య్ జ్ఞాన‌ముత్తు డైరెక్షన్‌లో హీరో చియాన్ విక్ర‌మ్ న‌టించిన మూవీ కోబ్రా. తమిళంలో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ తెర‌క్కెన ఈ సినిమాలో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఇక‌, ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మూవీ యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. కోబ్రా మూవీ ఓటీటీ హక్కులను సోనీ లివ్ దక్కించున్న విషయం తెలిసిందే. సెప్టెంబరు 28 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సోనీ లివ్ సోషల్ మీడియాలో తెలిపింది. ఇందుకు సబంధించి కొత్త ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. అయితే ఏ భాషల్లో రిలీజ్ అవుతుందో క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement