Friday, April 26, 2024

టక్ జగదీష్ రిలీజ్ పై క్లారిటీ

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈ సినిమాలో నాని సరసన రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా ఓటిటి లో రిలీజ్ కాబోతున్నట్లు సోషల్ మీడియా లో టాక్ నడుస్తుంది. ఇదే విషయమై చిత్రయూనిట్ స్పందిస్తూ… అదంతా అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను కేవలం థియేటర్స్ లోనే విడుదల అవుతుందని ఓటీటీ లో నో ఛాన్స్ అని అన్నారు. కాగా ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. దీంతోపాటు నాని అంటే సుందరానికి, శ్యామ్ సింగ రాయ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement