Wednesday, May 22, 2024

శివ రాజ్‌కుమార్ ‘ఘోస్ట్’ తెలుగు రిలీజ్ డేట్ పై క్లారిటీ..

కన్నడ సినీ ఇండ‌స్ట్రీలోని అగ్ర హీరోలలో ఒకరైన శివ రాజ్ కుమార్ నటించిన పాన్ ఇండియా యాక్షన్ సినిమా ‘ఘోస్ట్’. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై 31వ సినిమాగా ప్రముఖ నిర్మాత, రాజకీయ నాయకులు సందేశ్ నాగరాజ్ నిర్మించారు. కాగా, కర్ణాటకలో విజయ దశమి కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాని విడుదల చేశారు. ఇక‌, తెలుగులో వచ్చే వారం విడుదల చేయనున్నట్లు వెల్ల‌డించారు మేక‌ర్స్.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నవంబర్ 4న ‘ఘోస్ట్’ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు అనౌన్స్ చేశారు. తెలుగులో నవంబర్ 3న తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’, ‘సత్యం’ రాజేష్ ‘మా ఊరి పొలిమేర 2’, రక్షిత్ అట్లూరి ‘నరకాసుర’, వికాస్ ముప్పాల ‘ప్లాట్’తో పాటు మరో రెండు మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement