Sunday, April 28, 2024

సర్కారు నౌకరి టీజ‌ర్ విడుదల వేడుక‌…

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మాణ సంస్థ ఆర్కే -టె-లీ షో స్థాపించి పాతికేళ్లు అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాయని సునీత కుమారుడు ఆకాష్‌ ను హీరోగా పరిచయమవుతున్న ‘సర్కారు నౌకరి ‘ సినిమా టీ-జర్‌ విడుదల చేశారు. గంగనమోని శేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భావనా వళపండల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్కే -టె-లీ షో 25 ఏళ్ల వేడుకలో నిర్మాతలు సురేష్‌ బాబు, మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ యెర్నేని, టీ-జీ విశ్వప్రసాద్‌,ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు గంగనమోని శేఖర్‌ మాట్లాడుతూ ఒక లైన్‌ వినిపిస్తే కె.రాఘవేంద్రరావు కి నచ్చింది. నాకు సర్కారు నౌకరి సినిమా చేసే అవకాశం కల్పించారు. రాఘవేంద్రరావు కి థాంక్స్‌ చెబుతున్నా” అన్నారు.

సింగర్‌ సునీత మాట్లాడుతూ రాఘవేంద్రరావు మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ సర్కారు నౌకరి సినిమా నిర్మించారు. మీ అబ్బాయి మంచి నటు-డే కాదు సంస్కారం, మంచి నడవడిక ఉన్న వ్యక్తి. భవిష్యత్తు బావుంటుందని రాఘవేంద్రరావు గారు చెప్పినప్పుడు నా లైఫ్‌ లో అందుకున్న బెస్ట్‌ కాంప్లిమెంట్‌ అనిపించింది. అని చెప్పింది.

కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ – కొత్త టాలెంట్‌ ను ఎంకరేజ్‌ చేసేందుకే ఆర్కే -టె-లీ ఫిలింస్‌ స్టార్ట్‌ చేశాను. ఈ వేదిక మీదున్న చాలా మంది పెద్ద నిర్మాతలు చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు చిన్న సినిమాలు చేసి కొత్త టాలెంట్‌ కు అవకాశాలు ఇస్తే ఇన్నేళ్లుగా నేను చేసిన ప్రయత్నానికి కొనసాగింపుగా ఉంటు-ంది. మా సంస్థలో ఎంతోమంది యంగ్‌ టాలెంట్‌ ఉన్నారు. మీరు చేసే చిన్న సినిమాల్లో వారికి అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నా.” అన్నారు.
ఇంకా నిర్మాత డి.సురేష్‌ బాబు, ప్రసాద్‌ దేవినేని, నిర్మాత టీ-జీ విశ్వప్రసాద్‌, నిర్మాత నవీన్‌ యెర్నేని, రచయిత బీవీఎస్‌ రవి, సంగీత దర్శకుడు శాండిల్య, హీరోయిన్‌ భావన వళపండల్‌, హీరో ఆకాష్‌, సంగీత దర్శకుడు సురేష్‌ బొబ్బిలి తదితరులు మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement