Monday, April 29, 2024

Editorial – ఆ పాట శాశ్వ‌తం..

ఉద్యమ పాటల సేనాని అనంత లోకాలకు తరలి వెళ్లారు. వేలాది ప్రజ భాగ్యనగరపు వీధుల్లో ఆయన అంతియాత్రలో పదం పదం కలిపి, గొంతు గొంతు కలిపి నివాళులు అర్పించారు. అంతిమయాత్రలోనూ సముద్రపు హోరు.. జనగళ హోరు. పాట మార్మోగింది. ప్రజా యుద్ధనౌక గద్దర్‌ ఆకస్మిక మరణం అభిమానులనే కాకుండా, తెలుగువారందరినీ తీవ్రంగా కలచివేసింది. ఆయన మరణంతో పాట మూగబోయింది. పాటే ఆయన జీవితం.. పాటే ఆయన ఆయుధం… పాటతోనే ఆయన దేశ మంతటా అభిమానులను కూడగట్టుకున్నా రు. పాటకు ఆయన పర్యాయపదం. బడుగుల జీవన వ్యథను సంగీత సాహిత్యాలతో మేళవించి చెప్పడంలో ఎవరి పంథా వారిదే అయినా, ‘గద్దర్‌ స్టయిల్‌’ అంటూ ప్రత్యేక ఒరవడి సకల జనమోదం పొందింది. అణగారి న వర్గాల కోసం జీవితాంతం పోరాటం సాగించారు. గద్దర్‌ అసలు పేరు గుమ్మడి విఠ ల్‌ రావు. దళిత కుటుం బంలో పుట్టి ఇంజనీరింగ్‌ చదివిన ఆయనకు ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నా, తాను నమ్మిన సిద్ధాంతం కోసం, భావజాలం ప్రచారం కోసం జీవితాన్ని అంకితం చేశారు. పేదల కన్నీటిగాథలను ఆయన మాదిరిగా వర్ణించినవారు, గజ్జె కట్టి జనాన్ని తన్మయం చేసినవారు మరొకరు లేరు. జననాట్య మండలి వ్యవస్థాపకుల్లో ఒకనిగా గద్దర్‌ కళ ప్రజల కోసమేనని నిరూపించారు.


బుర్రకథకు ప్రత్యేకత తెచ్చిన నాజర్‌ తన నృత్యంతో, హావభావాలతో, వాక్పటిమతో ఏ విధంగా అయితే జనాన్ని ఆకట్టుకునే వారో, గద్దర్‌ కూడా అదే మాదిరిగా కళా వసంతునిగా పేరొందారు. భూమికోసం, భుక్తి కోసం అణగారిన వర్గాల కోసం పోరాడిన చాలామంది వలెనే ఆయన కూడా మార్క్సిస్టు భావజాలానికి ప్రభావి తులయ్యారు. గ్రామాల్లో భూస్వాములు, పెత్తందారుల అణచివేతలను తన పాటలతో ప్రజల ముందుంచిన కళాకారుడు. ఆయనతో పాటు నృత్యం చేయడానికి, దరువులు వేయడానికి కళాకారులు ముచ్చట పడేవారు. గద్దర్‌ మాదిరిగా పాడాలనీ, అందెల చిందులు వేయాల ని ఎంతోమంది ప్రయత్నించేవారు. చేతిలో కర్ర, భుజాన నల్ల గొంగళితో గద్దర్‌ వేషధారణలో విప్లవ గీతాలను ఆలపించడం తర్వాతి తరం వారికి ఒక ఒరవడి అయిం ది. గద్దర్‌ పాటల్లో తెలంగాణ మారుమూలల పల్లెల పలుకుబడులు, అమ్మవారిని కొలిచే గీతాలు చాటువులు ఎక్కువ కనిపించేవి. గ్రామాల్లోని ప్రజల అమాయకత్వా న్నీ, అవిద్యనూ ఆసరాగా తీసుకుని వారిని సంపన్న వర్గాలు దోపిడీ చేయడాన్ని కళ్ళారా చూసి చలించిన గద్దర్‌ తన పాటల్లో వారి వేదననూ, ఆకలి కేకలను ప్రతి బింబింపజేశారు.

వ్యవసాయ కూలీలు, దళిత, పేద వర్గా లను భూస్వామ్య వర్గాలు హింసించడాన్నీ, పరిహసించ డాన్ని చూసి తట్టుకోలేకపోయారు. జీవితంలోంచే ఆయన పాట వచ్చేది. ఆశువుగా అప్పటికప్పుడు పాట కట్టి దానిని ప్రజల ముందుంచిన ఆశుకవి గద్దర్‌ రాజ్యాధికారం ద్వారానే దళితుల సమస్యలు పరిష్కారం అవుతాయని త్రిక రణశుద్ధిగా విశ్వసించారు. ప్రత్యేక తెలంగాణలో దళితులకు పెద్ద పీట వేయాలని కోరుకు న్నారు. ఆయన తెలంగాణ కోసం ఉద్యమించినప్పటికీ ఆంధ్రప్రాంత దళితులపట్ల కూడా సానుభూతిని ప్రక టించే వారు. కారంచేడులో దళితుల ఊచకోతను నిరసి స్తూ గ్రామగ్రామాన తిరిగి ప్రజలను చైతన్యపర్చారు. ఆంధ్ర ప్రాంతంలో దళితుల ఉద్యమాల్లో ఆయన పాల్గొ న్నారు. గద్దర్‌ గజ్జెకడితే చూడటానికి అన్ని ప్రాంతాల నుంచి జనం తరలి వచ్చేవారు.
‘నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన ఋణం తీర్చుకుంటనే మాయమ్మా!’ అనే పాటకూ, ‘పొడుస్తున్న పొద్దు నడుస్తు న్న కాలమా!’ పాటకు ఆయనకు అవార్డులొచ్చాయి. నంది అవార్డును ఆయన తిరస్కరించారు. ఈ దేశంలో ఎనభై శాతం ఉన్న యువతకు చేతినిండా పని కల్పించాల ని గద్దర్‌ తన పాటల్లో స్పష్టం చేశారు. ఈనాడు పాలకులు కూడా యువతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. గద్దర్‌ పాటకూ, ఆటకూ చలించ ని వారు లేరు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజాకవి ఎలా ఉండాలో వివరించేవారు. గద్దర్‌ ప్రజల్లో మమేకమై పాటలను ఆలపించేవారు. గద్దర్‌ ఈ తరం వారికీ, పాత తరం వారికీ వారథి.ఆయన ఏ భావజాలానికి అంకిత మైనా, అన్ని భావాలనూ గౌరవించేవారు.అన్నింటినీ సందర్భానుసారం ప్రస్తావించేవారు. అట్టడుగు స్థాయి లో పుట్టినా, అత్యున్నత సంస్కారాన్ని వంటబట్టించుకు న్నారు

. ప్రజాకళాకారుడు ప్రజల మధ్య తిరిగేవాడు ఆహార్యంలో, హావభావాల్లో ప్రజలలో కలిసి పోవాలన్న నమ్మకం ఉన్న కవి గాయకుడు గద్దర్‌. గద్దర్‌పై కాల్పులు జరిగాయి. ఆయన శరీరంలో 26 ఏళ్లు పైగా బులెట్‌ ఉం ది. గద్దర్‌ ప్రజల హక్కుల కోసం, ప్రజల కోసం జీవితాం తం పోరాడి ప్రజాయుద్ధ నౌక అని ప్రజలిచ్చిన బిరుదును సార్థకం చేసుకున్నారు. ఆయన ఈలోకం నుంచి శాశ్వ తంగా నిష్క్రమించినా ఆయన పాట అందరి గుండెల్లో మారుమోగుతూనే ఉంది… ఉంటుంది.!

Advertisement

తాజా వార్తలు

Advertisement