Wednesday, May 1, 2024

ఎస్ఎస్ఎంబీ 28 స్పెషల్ వీడియో…సాయంత్రం అంతకు మించి

నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సినీ రాజకీయ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదిక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా నుంచి సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ విడుదల అయ్యి సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతుంది. కాగా ఈ సినిమా తరువాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ 28 సినిమా తెరకెక్కుబోతుంది.

అయితే ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అతడు సినిమాలోని వాయిస్ ఓవర్ తో ఈ వీడియో మొదలవుతుంది. మహేష్ కెరీర్ లో తీసిన ఎమోషనల్ క్లిప్పింగ్స్ అన్ని ఒకటిగా చేర్చి ఈ వీడియోని తయారు చేశారు. అలాగే మహేష్ లోని మానవతావాదం ను కూడా చూపించారు. వికలాంగులతో, గుండె శస్త్ర చికిత్స చేయడంలో సహాయపడటం కూడా ఈ వీడియోలో చూపించారు. అలాగే ఈరోజు సాయంత్రం నాలుగు గంటల 5 నిమిషాలకు ఎస్ఎస్ఎంబీ 28 కు సంబంధించి ప్రత్యేక ప్రకటన రానుందని ప్రకటించారు.

https://twitter.com/haarikahassine/status/1424437762174844928?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement