Thursday, May 2, 2024

చిరుకి రాఖీ కట్టిన కీర్తి సురేష్..

మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్. నేడు (ఆగస్ట్ 22) చిరు బర్త్ డే సందర్భంగా, కొద్ది సేపటి క్రితం చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇదే క్రమంలో తాజాగా అన్న – చెల్లెలి అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ సందర్భంగా మెగాస్టార్ భోళా శంకర్ చిత్రంలో ఆయన చెల్లిగా కీర్తి సురేశ్ నటిస్తున్నట్టు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. ఈమేరకు ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో చిరంజీవికి కీర్తి సురేశ్ రాఖీ కడుతుండాన్ని చూపించారు.

కాగా తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వేదాళం కి అఫీషియల్ రీమేక్‌గా ఈ మూవీ రూపొందనుంది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబుకి జంటగా సర్కారు వారి పాట చిత్రం, అలాగే కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అణ్ణాత్తలో నటిస్తోంది. ఇక భోళా శంకర్‌లో చిరు చెల్లిగా కీర్తి నటిస్తుందనగానే అందరిలోనూ అంచనాలు బాగా మొదలయ్యాయి. గతంలో మెగాస్టార్ నటించిన చూడాలని ఉంది కోల్ కతా బ్యాక్ డ్రాప్‌లో రూపొందగా..ఇప్పుడు భోళా శంకర్ కూడా కోల్ కతా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కబోతుండటం విశేషం.

YouTube video

ఇది కూడా చదవండి: చైనా చేస్తున్న పని వల్ల పురుషుల్లో అంగం సైజు త‌గ్గుతోంద‌ట‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement