Thursday, May 2, 2024

Chiru birthday:గడ్డితో ఫోటో చెక్కిన అభిమాని

రేపు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అభిమానులు నిన్నటి నుంచే సోషల్ మీడియాలో హడావుడి స్టార్ట్ చేసేశారు. తాజాగా జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన రవి, వీరేష్, రాజ్ అనే ముగ్గురు చిరుపై ప్రత్యేకంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. డ్రోన్ షాట్ లో ఓ చిరు ఫోటో కనిపించేలా నేల మీద గడ్డితో ఆకారాన్ని చెక్కించి ప్రత్యేకంగా బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి తన అభిమానులను మెగా బ్లడ్ బ్రదర్స్ గా ట్రీట్ చేస్తారన్న సంగతి తెలిసిందే.. స్వయం కృషితో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఒకొక్క మెట్టు ఎక్కుతూ.. దాదాపు 20ఏళ్ళు నెంబర్ వన్ హీరోగా తెలుగు చిత్ర సీమను ఏలారు చిరంజీవి. డ్యాన్సులు, ఫైట్స్ అంటూ ప్రేక్షకులకు కొత్త హీరోయిజాన్ని పరిచయం చేశారు చిరు.

ఇది కూడా చదవండి:

Advertisement

తాజా వార్తలు

Advertisement