Wednesday, May 1, 2024

చిరుకి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేష్..

మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు తెలిపారు టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్. పద్మభూషణ్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాశీస్సులు అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. పట్టుదలతో పైకెదిగిన మీ సినీ ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. మీ సేవా కార్యక్రమాలతో సమాజంలో ఒక ఒరవడి సృష్టించారని పేర్కొన్నారు. మీరు మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.అటు, లోకేశ్ స్పందిస్తూ… తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్వయంకృషితో ఎదిగారని, తన నటనా ప్రావీణ్యంతో ఉన్నతస్థానానికి ఎదిగారని చిరంజీవిని కీర్తించారు. లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న పద్మభూషణ్, మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. మీరు చిరకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను అని వివరించారు.

ఇది కూడా చదవండి: చిరుకి రాఖీ కట్టిన కీర్తి సురేష్..

Advertisement

తాజా వార్తలు

Advertisement