Friday, April 26, 2024

చిన్మయి బేబీ బంప్…అది ఫేక్ న్యూస్ అట!!

ప్రముఖ సింగర్ చిన్మయి గురించి చెప్పనవసరం లేదు. అప్పట్లో మీటు ఉద్యమంలో భాగంగా ప్రముఖ లిరిసిస్ట్ వైరముత్తు పై లైంగిక ఆరోపణలు చేసి హాట్ టాపిక్ గా మారింది. ఇక అప్పటి నుంచి కూడా ఇండస్ట్రీలో ఏ ఒక్క మహిళ కు ఇబ్బందులు వచ్చినా సోషల్ మీడియా వేదికగా తన గొంతును లేపుతోంది. అయితే తాజాగా తనకి ప్రెగ్నెన్సీ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో పై స్పందించింది. తనకు ప్రెగ్నెన్సీ లేదని ఆ పిక్ పెళ్లికి సంబంధించిన ఫోటో అని ఆ ఫోటోలో అలానే కనిపిస్తుందని చెప్పుకొచ్చింది.

కొన్ని యూట్యూబ్ ఛానల్ చిన్మయి బేబీ బంప్ అంటూ ఫోటోను వైరల్ చేస్తున్నారని… కానీ అందులో నిజం లేదని సోషల్ మీడియాలో తన వ్యక్తిగత విషయాలు సన్నిహితుల గురించి అస్సలు షేర్ చేయమని, సమయం వచ్చినప్పుడు నేను గర్భధారణకు సంబంధించిన విషయం చెప్పొచ్చు చెప్పకపోవచ్చు అది నా నిర్ణయం. నా వ్యక్తిగత విషయం. మేము 100% పిల్లల ఫోటోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేయము. వారు కూడా సోషల్ మీడియాలో ఉండరు. దయచేసి ఇటువంటి వార్తలు ఆపండి అలసిపోయాను అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement