Thursday, May 2, 2024

“ఆపరేషన్‌ రావణ్‌” నుంచి చందమామ కథలోన… లిరికల్ సాంగ్….

..రక్షిత్‌ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ఆపరేషన్‌ రావణ్‌’. ఈ చిత్రాన్ని న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి చందమామ కథలోన అనే లిరికల్‌ పాటను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుదల చేశారు.

శరవణ వాసుదేవన్‌ సంగీతాన్ని అందించిన ఈ పాటకు పూర్ణాచారి సాహిత్యం అందించారు. హరి చరణ్‌, గీతామాధురి ఆలపించారు. ”చందమామ కథలోన, అందమైన పిల్లేనా, కళ్లముందు కదిలిందా, తుళ్లి తుళ్లి పడ్డానా.. ”అంటూ ప్రేయసి అందాన్ని పొగుడుతూ సాగుతుందీ పాట.

ఈ సినిమాలో రాధికా శరత్‌ కుమార్‌, చరణ్‌ రాజ్‌, తమిళ నటు-డు విద్యా సాగర్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement