Thursday, May 2, 2024

అమీర్‌ఖాన్ సినిమాలో నాగచైతన్య

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్‌ సింగ్ చద్దా’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో అక్కినేని నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు. ఈ పాత్ర కోసం నాగచైతన్య 30 రోజుల పాటు డేట్స్‌ కేటాయించాడు. మే నెల నుంచి షూటింగ్‌లో చైతన్య భాగమవుతున్నాడు. నిజానికి చైతూ పాత్రలో తొలుత తమిళ నటుడు విజయ్‌ సేతుపతి నటించాల్సింది. కానీ డేట్స్‌ అడ్జస్ట్‌ చేయడంలో ఇబ్బందులు తలెత్తడంతో విజయ్‌ సేతుపతి ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నాడని వార్తలు వినిపించాయి. మరి ‘లాల్ సింగ్ చద్దా’లో నాగచైతన్య ఎలాంటి పాత్ర చేయబోతున్నాడు, పాత్ర వ్యవధి ఎంత సేపు ఉంటుందనే విషయాలకు సంబంధించిన సమాచారం లేదు. అద్వైత్‌ చందన్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కరీనా కపూర్‌ హీరోయిన్‌. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్‌ 24న విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement