Thursday, November 14, 2024

లేడీ ఫ్యాన్ ల‌గేజ్ ని మోసిన.. హీరో అజిత్

లండ‌న్ విమానాశ్ర‌యంలో హీరో అజిత్ చేసిన ప‌ని ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. విష‌యం ఏంటంటే.. తన భార్యకి అజిత్ చేసిన సాయం గురించి ఆమె భర్త కార్తీక్ వివరించారు. మా 10 నెలల బిడ్డతో గ్లాస్గో నుంచి చెన్నైకి నా భార్య ఒంటరిగా ప్రయాణిస్తోంది. లండన్ విమానాశ్రయంలో అజిత్ కనిపించారు. వెంట‌నే నా భార్య సర్ ఒక్క సెల్ఫీ ప్లీజ్ అని అడిగింది. దీనితో అజిత్ ఆమెతో ఫోటో దిగడం మాత్రమే కాదు.. నా భార్య లగేజ్ ని విమానం వరకు మోశారు. నేను చూసుకుంటాను సర్ అని చెప్పగా.. పర్వాలేదు.. నాకూ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇబ్బంది ఏంటో నాకు తెలుసు అని అజిత్ స్వయంగా ఆమె లగేజ్ మోశారు. అనంతరం షటిల్ బస్సులో కూడా ఆమె లగేజ్ తో ఇబ్బంది పడుతుంటే అజిత్ సాయం చేశారు. ఆయన వ్యక్తిత్వం నన్ను కదిలించింది అని అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. దీనితో అజిత్ ని చూస్తూ ఆయన ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అజిత్ ని ఈ స్థాయికి చేర్చింది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా అజిత్ ప్రస్తుతం తన 62వ చిత్రానికి రెడీ అవుతున్నారు. అజిత్ రియల్ లైఫ్ లో చాలా సింపుల్ గా ఉండే వ్యక్తి. సామాన్య వ్యక్తిగా ప్రజల్లో కలసిపోతుంటారు. తాజాగా అజిత్ చేసిన పని అభిమానుల మనసు దోచుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement